Feb 06,2023 16:16
  •  ఎమ్మెల్యే వెంకటే గౌడ

ప్రజాశక్తి-వికోట : ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ తెలిపారు. మండలంలోని ముదరందొడ్డి పంచాయతీలోని సుద్దులకుప్పం సచివాలయ పరిధిలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే  చేపట్టారు. స్థానిక సర్పంచ్ దామోదర్ ఆధ్వర్యంలో వారికి స్థానిక ప్రజాప్రతినిధులు నేతలు అధికారులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సుద్దులకుప్పం గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని విచారించి లబ్ధిదారులకు కరపత్రాలను  అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు జగనన్న ప్రభుత్వంలో తమకు ఎలాంటి కష్టాలు లేవని ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా అందుతున్నాయని వారి దృష్టికి తీసుకువచ్చారు. పెంచిన నూతన పింఛన్లు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు జగనన్న పక్కా గృహాలు  మంజూరు చేయాలని వారి దృష్టికి తీసుకురాగా సత్వరం సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు తమ ఇండ్లవద్దే నిర్వహించుకునే వెసులుబాటును ముఖ్యమంత్రి కల్పించారని కొనియాడారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించే చర్యలు చేపట్టాలని ఉపాధి హామీ ఎపిఓ అశోక్ రెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యువరాజ్,  వైస్ ఎంపీపీ లు లక్ష్మణ్రెడ్డి,  తమీంఖాన్, జిల్లా పరిషత్ సలహా మండలి సభ్యులు గౌస్, ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అమర్నాథ్, ముదరందొడ్డి సింగిల్ విండో అద్యక్షులు గోపిరెడ్డి, రెస్కో డైరెక్టర్ భూపతి యాదవ్, ఎంపీడీవో బాలాజీ వివిధ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు