'గడప గడపకు మన ప్రభుత్వం'లో మంత్రి రోజా
ప్రజాశక్తి- నగరి: ప్రభుత్వ పథకాలపై ప్రజాచైతన్యం కోసమే 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడాశాఖా మంత్రి ఆర్‌కె రోజా తెలిపారు. నగరి మండలం నంబాకం సచివాలయం పరిధిలోని కష్ణారామాపురం పంచాయతీలలో మంత్రి రోజా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందయా లేదా అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే పరిష్కరించాలని సబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ భార్గవి, వైస్‌ఎంపీపీ కన్నెప్పన్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ, సచివాలయ సిబ్బందిలు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










