Oct 07,2022 23:44

సమావేశంలో కలెక్టర్‌

పెండింగ్‌లో ఉన్న అర్జీలపై వెంటనే స్పందించండి : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ :
ప్రభుత్వం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సచివాలయాల పరిధిలో ప్రజాప్రతినిధుల కార్యక్రమం ముగిసిన వెంటనే వారు గుర్తించిన పనులకు సంభందించి అంచనాలను రూపొందించి సిపిఓ కార్యాలయానికి పంపాలని, ఈకార్యక్రమంలో వచ్చిన ఆర్జీలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారయణన్‌ అన్నారు. జిల్లాకలెక్టర్‌ సిపిఓ, జడ్పీ సీఈవో, ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులు, ఏపీ డీసీఎల్‌ అధికారులు, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన అధికారులు మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారని వారు 100 శాతం ఇంటింటికి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వారు గుర్తించిన పనులకు సంబంధించి అంచనాలను తయారు చేయించి ప్రతిపాదనలను సిపిఓ కార్యాలయానికి పంపాలన్నారు. అలాగే 5లక్షల లోపు విలువైన పనులకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఆపై ఉన్న వాటికి టెండర్లు పిలవాలని ఈ కార్యక్రమాలను అత్యంత వేగంగా నిర్వహించాలని అన్నారు. మొత్తం 171 గ్రామ సచివాలయాల్లో 100శాతం పనులు పూర్తి అయ్యాయని వీటికి సంబంధించి 105 సచివాలయాలలో పనులు గుర్తించడం జరిగిందన్నారు. అయితే ఇంకా పెండింగ్లో ఉన్న సచివాలయాలలో పనులను గుర్తించి వెంటనే అప్లోడ్‌ చేయించాలని అన్నారు. పరిపాలన ఆమోదం పొందిన వెంటనే వేగంగా పనులను కూడా పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటివరకు 815 పనులు కోసం ప్రతిపాదనలు రావడం జరిగిందని ఇందులో 765 పనులు ఐదులక్షల రూపాయల లోపు గుర్తించడం జరిగిందని ఈ పనులను వెంటనే గ్రౌండ్‌ అయ్యేలా చూడాలన్నారు. ఈ పనులలో ప్రధానంగా పంచాయతీరాజ్‌ విభాగానికి సంబంధించి 321, ఆర్డబ్ల్యూఎస్‌ విభాగానికి సంబంధించి 430, ఏపీ ఎస్పీడీసీఎల్‌ 9, మున్సిపల్‌ అర్బన్‌ డెవలప్మెంట్‌కు సంబంధించి 45పనులు ప్రతిపాదనలు రావడం జరిగిందని, రూ.5లక్షలలోపు పనులను వెంటనే ఆమోదం ఇవ్వాలని ఆపై ఉన్న వాటికి టెండర్లు పిలవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా విభాగాల వారీగా ఉన్న పనులను వాటి పురోగతి వివరాలను ఆయా అధికారులను జిల్లా కలెక్టర్‌ అడిగి తెసుకున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంతవరకు 2599 అర్జీలు రావడం జరిగిందని, వీటిలో 584 రెడ్రేసాల్‌ అయ్యాయని మరో 1035 దరఖాస్తులకు సంబంధించి పూర్తి వివరాలు మండలాల నుంచి రావాల్సి ఉందని వీటిని మరో రెండు రోజుల లోపల పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ ఉమాదేవి, జడ్పీ సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి, ఎస్‌ ఈ చంద్రశేఖర్‌ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్‌ఎస్‌ఈ నాగజ్యోతి పాల్గొన్నారు.