అగ్నికి ఆహుతౌతున్న వరిగడ్డి వామి
ప్రజాశక్తి-పీలేరు:
ఆదివారం స్థానిక చిత్తూరు రోడ్డులో వెంకట రెడ్డి, సుశీలమ్మలకు చెందిన మూడు ట్రాక్టర్ లోడ్ల వరి గడ్డి అగ్నికి ఆహుతైంది. వేసవి కాలం కావడంతో పశువులకు మేత సమస్య వచ్చే ప్రమాదం ఉండడంతో పాడి రైతులు తమ పశువులకు కావలసినంత వరి గడ్డిని కొనుగోలు చేసుకుని తమ ఇండ్లకు సమీపంలో నిల్వచేసి ఉంచుకున్నారు. దురదృష్టవశాత్తు ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్లులు వరి గడ్డికి నిప్పుపెట్టారు. దీంతో పాకాలకు చెందిన అగ్నిమాపక యంత్రం ఘటనా స్థలానికి చేరుకుని నిప్పు ఆర్పి పెద్ద ముప్పు సంభవించకుండా చూసింది.










