Nov 02,2023 17:45

గౌతంరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు

గౌతంరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు
గౌతంరెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు
ప్రజాశక్తి-సంగం:సంగం బ్యారేజీ వద్ద కీర్తిశేషులు మేకపాటి గౌతమ్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి గౌతమ్‌ రెడ్డికి జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి మాట్లాడుతూ మేకపాటి గౌతంరెడ్డి మతి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు.యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆయన చేసిన కషి ఎనలేనిదని పేర్కొన్నారు. గౌతమ్‌ రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఎంతో కషి చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్‌ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమని అదేవిధంగా ఆత్మకూరులో రెండో సారి ఎమ్మెల్యేగా మేకపాటి విక్రం రెడ్డి గెలుపొందడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సర్పంచ్‌ ల ప్రతినిధి చందన్‌ కుమార్‌ ,వైసీపీ నాయకులు ఫణీంద్ర రెడ్డి,రామారావు,రవీంద్ర బాబు, వేణు, శివ, నారసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.