Oct 02,2023 21:35

మాట్లాడుతున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

మాట్లాడుతున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
గాంధీ అడుగుజాడల్లో నడవాలి
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకొని భారతావని స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్ముడు గాంధీజీని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం వైఎస్‌ఆర్‌సి కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. .ఆయన మాట్లాడారు. దేశభక్తి,చిత్తశుద్ధి, నిజాయతీ, సేవా భావాలు అందరికీ ఆదర్శం కావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ రూప కుమార్‌ యాదవ్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శ్రీకాంత్‌ రెడ్డి, జిల్లా కోశాధికారి కాటంరెడ్డి రవీంద్ర రెడ్డి , జిల్లా లీగల్‌ సెల్‌ అద్యక్షుడు మురళీధర్‌ రెడ్డి పాల్గొన్నారు.