నార్పల వీధుల్లో గాడిదను పట్టుకుని వెళ్తున్న మహిళ
ప్రజాశక్తి-నార్పల గాడిద పాలు 20 మిల్లీలీటర్లు రూ.100కు విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు చెందిన ఐదుగురు మహిళలు ఐదు గాడిదలను తీసుకొచ్చి నార్పలలో ఇళ్లిళ్లూ తిరుగుతూ గాడిద పాలు విక్రయిస్తున్నారు. గాడిద పాలు తాగితే చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనేది చాలామంది నమ్మకం. అయితే ఈ మధ్యకాలంలో గాడిదలు కరువైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఐదురుగు మహిళలు ఒక్కొక్క గాడిదకు సుమారు రూ.50వేలు వెచ్చించి ఐదు గాడిదలు తీసుకుని నార్పలకు విచ్చి ఇంటింటికీ వెళ్లి అవసరమైన వారికి పాలు విక్రయిస్తున్నారు.










