Mar 29,2023 13:32

ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వు నందు విధులు నిర్వహిస్తూ 23-02-2023వ తేదిన అనారోగ్యంతో మరణించిన ARHC 499  ఆనంద్ మోహన్  సతీమని ఉష రాణికి ఈరోజు విడో ఫండ్ నుండి రూ.50,000 వేలు మరియు ఫ్లాగ్ ఫండ్ నుండి రూ.25,000 చెక్కులను జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, IPS, చిత్తూరు పోలీస్ ఆఫీస్ క్లర్క్ పార్ధ సారధి సమక్షంలో అందజేసారు. ఈ సందర్భంగా ఎస్పీ మృతుడి కుటుంబానికి భరోసా ఇస్తూ పోలీస్ డిపార్టుమెంటు తరపున వారి కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.