ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : ప్రజల భాగస్వామ్యం అవగాహనతో కీటక జనిత వ్యాధులను అరికట్టవచ్చునని మలేరియా సబ్ యూనిట్ అధికార వై.వి. లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం డా.వైఎస్.ఆర్.పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 10,11,12,28 వార్డులలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఇంటి పరిసరాలలో మీరు నిలవ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డబ్బాలు, టైర్లు, కొబ్బరి బొండాలు మీరు నిలవ లేకుండా చూసుకోవాలన్నారు డెంగ్యూ నివారణ మసోత్సవాలలో భాగముగా మున్సిపల్ ఉన్నత పాఠశాల, కడకట్ల విద్యార్థులకు డెంగ్యూ వ్యాధి వ్యాప్తిపై అవగాన కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యకర్తలు మేరీ, పోసమ్మ,మంగతాయారు, చంద్రకళ, ఆరోగ్య సహాయకులు ఈ కాంతారావు, ఆశాలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.










