- కంటి ఆపరేషన్ కు 24 మంది సెలెక్ట్
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండల కేంద్రంలోని మహతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగరాజు సహకారంతో పిఇఎస్ హాస్పటల్ కుప్పం వారిచే బైరెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కంటి వైద్యం కోసం వచ్చిన 196మంది పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో 24మందిని ఆపరేషన్ అవసరమైన వారికి తక్షణమే డాక్టర్ల పర్యవేక్షణతో బస్సులో హాస్పల్ కి ఉచితముగా తరలించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేసే మంచి మనస్సు ఉన్న మహతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగరాజు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, మంచి మనస్సు ప్రసాదించి రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నారు. మండల ప్రజలు కార్యక్రమంలో అక్కడికొచ్చిన డాక్టర్లకు వైద్యం కోసం వచ్చిన ప్రజలకు బహుతి ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పిఇఎస్ హాస్పటల్ డాక్టర్స్, మహతి ఫౌండేషన్ టీమ్, ప్రజలు పాల్గొన్నారు.










