- ఉచిత బోర్లతో రైతుల్లో ఆనందోత్సవాలు
ప్రజాశక్తి--ఆత్మకూరు : ఆత్మకూరు మండల వ్యాప్తంగా లక్ష రూపాయలు ఇచ్చి అప్పులు కుప్పలు చేసి, బోర్లు వేయించిన రైతులు మనోగతాన్ని, తరిమికొట్టేందుకే రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో, ఉచిత బోర్లు వేయించి, రైతులకు కాస్త ఊరట కలిగిస్తున్నారని, పంపనూరు గ్రామ సర్పంచ్ యడమల ఎర్రిస్వామి. ఈ మేరకు ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామపంచాయతీలో, సుబ్బర బాలరాజు పొలంలో, తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ కింద ఉచిత బోరు వేయించడంతో, నీరు సమృద్ధిగా లభించినట్టు, సర్పంచ్ ఎర్రిస్వామితో పాటు, మాజీ సర్పంచి వన్నూరప్ప, వైసీపీ నాయకులు ఓబుల్ పతి, అక్కులన్న, రామకృష్ణ, తదితరులతోపాటు రైతు బాలరాజు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటామని అభిప్రాయం వ్యక్తం చేశారు.










