ప్రజాశక్తి-కాళ్ల : జువ్వలపాలెం గ్రామం తూర్పు పేటలో పైడితల్లి అమ్మవారి నూతన ఆలయం నిర్మాణానికి గురువారం శంకుస్థాపన నిర్వహించారు. విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలనుంచి వచ్చి జువ్వలపాలెం తూర్పు పేటలో స్థిరపడ్డారు. సుమారు 250 సంవత్సరాలు చరిత్ర కలిగి పైడితల్లి అమ్మవారి కి రావి చెట్టు వద్ద పూజలు నిర్వహించేవారు. ఆలయ నిర్మాణ కమిటీగా ఏర్పడి నూతన ఆలయం నిర్మాణం సుమారు 50 లక్షలతో చేపట్టాలని తలంచారు. గురువారం పైడితల్లి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, డిసిసిబి చైర్మన్ పి. వి. ఎల్. నరసింహరాజు, ఉండి నియోజకవర్గజనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తిగ నాగరాజులు శంకుస్థాపనచేశారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు, గోకరాజు శివ బాబు, గ్రామ సర్పంచ్ మీసాల రమణ, ఉప సర్పంచ్ కఠారి లక్ష్మీపతిరాజు, రుద్రరాజు రామకృష్ణంరాజు, ముదుండి సురేష్ రాజు, మాజీ ఎంపీటీసీ నడింపల్లి విశ్వనాథరాజు, మాజీ ఉప సర్పంచ్ గోకరాజ్ వినోద్ రంగరాజు, మంతెనపెద నరసింహారాజు, దండు వెంకట కృష్ణంరాజు, గోకరాజు నాగరాజు, నడింపల్లి ప్రదీప్ రాజు, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ మీసాల శ్రీనివాస్, కార్యదర్శి దాసరి గిరి ప్రసాద్, ట్రెజరర్ నేరేడిమిల్లి రమేష్, కమిటీ సభ్యులు బొత్స గణేష్, రఘు మండల సత్యనారాయణ,నేరేడిమిల్లి అప్పారావు,నేరేడిమిల్లి నరేష్, ఎడ్ల శ్రీనివాస్, దాసరి ఏసుబాబు, దాసరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.










