Aug 15,2022 14:48

 ప్రజాశక్తి-పెద్దపంజాణి :  విద్యార్థులు జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకుని దేశభక్తిని పెంపొందించుకోవాలని సర్పంచ్ రమేష్ బాబు పేర్కొన్నారు.  సోమవారం కోగిలేరులో సర్పంచ్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, వాలంటీర్లు, విద్యార్థులు 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా  నిర్వహించారు.  ఈ  సందర్భంగా సర్పంచు మాట్లాడుతూ  స్వాతంత్ర్యదినోత్సవం గొప్పతనాన్ని వివరించారు. అలాగే సేవాకార్యక్రమాలను చేపడుతూ పలువురికి ఉపకారం చేస్తున్న రైడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సుబ్రమణ్యం, దళిత నాయకులు కల్లుపల్లి చిన్నాలను శాలువాలతో ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. అనంతరం కోగిలేరులో విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరందామ, ఉప సర్పంచ్ ఈశ్వర్ , వార్డుసభ్యులు శ్రీవాణి, రత్నమ్మ,  విఆర్ఓ సుధాకర్, సచివాలయ సిబ్బంది నజీర్ భాషా, జ్యోతిస్వరూప్,వాణి,సుజాత, హెచ్ ఎం రాజ,  ఉపాధ్యాయులు శారదమ్మ, లలితమ్మ,బసంతి,  వాలంటీర్లు,గ్రామపెద్దలు  పాల్గొన్నారు.