Apr 19,2023 15:30

ప్రజాశక్తి-ఉరవకొండ : ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆరవ రోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవాలలో భాగంగా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులతోపాటు నర్సులకు, సెక్యూరిటీ సిబ్బందికి ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. హాస్పిటల్ యందు అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, అడ్మిషన్ లో ఉన్న పేషెంట్లను అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బయటికి ఎలా తీసుకురావాలనే అంశాలపై సూచనలు సలహాలు ఇచ్చారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్టులు వాడకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ అధికారి లింగమయ్య, సిబ్బంది, ప్రభుత్వ వైద్యాధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.