- గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండలంలోని కంభం పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న దాసార్లపల్లి గ్రామం పరిధిలోని 1-37/2 ఇంటి నెంబర్ గల పూరీ ఇల్లు వెంకటమ్మ నివాసముంటు ఉండేది. ఆమె రెండు రోజుల క్రితం వారి కూతుర్ని చూసేందుకు వేరే ఊరికి వెళ్ళింది. ఇది గమనించిన దుండగులు బుధవారం రాత్రి సుమారు 11 గంటలకు వెంకటమ్మ పూరిల్లు అంటుకొని అధిక మంటలు రావడంతో గ్రామస్తులు హుటాహుటిన నీరు పోసి ఆర్పేకి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది పూర్తిగా దగ్ధమైన ఇంటిలో ఆహార పదార్థాలు కట్టు వస్త్రాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఆమెనూ ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.










