- రాజేష్ కు నాలుగు లక్షల సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం
ప్రజాశక్తి-వెదురు కుప్పం : ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఓ వరమని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి ఆదివారం తెలిపారు. వెదురు కుప్పం మండలం పచ్చికాపల్లం దాసరి కాలనీకి చెందిన లోకనాథం కుమారుడు రాజేష్ కి ఇటీవల అనారోగ్య కారణంగా వేలూరు సీఎం సి హాస్పిటల్ లో కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ కు సుమారు 10 లక్షలు పైగా ఖర్చు అయినట్లు బాధ్యతలు ఉప ముఖ్యమంత్రికే నారాయణస్వామికి తెలియజేశారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం బాధితుల దగ్గర నుండి బిల్స్ సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధుల ద్వారా రాజేష్ కి నాలుగు లక్షల రూపాయలు చెక్కును ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం జడ్పిటిసి సభ్యులు చలం పాలెం సుకుమార్, మాంబేడు మాజీ ఎంపీటీసీ సభ్యులు బండి రోసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










