Jun 05,2023 16:37
  • అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు  కేశవరెడ్డి  

ప్రజాశక్తి-నార్పల : నార్పల మండలంలోని నడిమిదొడ్డి గ్రామంలో నివాసముంటున్న కాoకా సూర్యనారాయణ నడిం దొడ్డి నుండి అనంతపురం వెళ్తుండగా ఆటో బోల్తా పడి వెన్నెముక దెబ్బతిని బాధపడుతున్న విషయం తెలుసుకొని అతని కుటుంబానికి అండగా నేనుంటాను అని భరోసా ఇచ్చి  మెరుగైన వైద్యం కోసం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం నిరుపేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమాడుగు కేశవరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మదమంచి ప్రతాప్ చౌదరి, జిల్లా రైతు ప్రతినిధి తిప్పన్న, రంగాపురం  శ్రీరాములు, నరసాపురం, శివరామకృష్ణ, ఆకుల లక్ష్మీనారాయణ, కొంకా అది.తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు  పాల్గొన్నారు.