Jan 13,2023 16:14

ప్రజాశక్తి-రొంపిచెర్ల : రొంపిచర్ల మండలం, చెంచెంరెడ్డిగారి పల్లి గ్రామపంచాయతీ, శ్రీరాముల వడ్డిపల్లిలో సర్పంచ్ సుధారాణి సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఇటీవల అనారోగ్యంతో మృతి మల్లికార్జున కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లికార్జున దినసరి కూలీతో జీవనోపాధి సాగిస్తూ అకస్మాత్తుగా మృతి చెందడంతో వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్ బీమాలో నమోదు అవ్వటం వలన కుటుంబ పెద్దను పోగొట్టుకున్నటువంటి కుటుంబానికి ఫ్యూనరల్ చార్జెస్ నిమిత్తం రూ.10000 చెక్కును అందజేయడం జరిగినది. అతి త్వరలో బాలన్స్ రూ.90000 నగదును కూడా నామిని ఖాతాలో జమ అవుతుందని మరియు నామిని యొక్క కుటుంబాన్ని వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ మంజూరు చేయించి కుటుంబాన్ని ఆదుకుంటామని గ్రామపంచాయతీ సర్పంచ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు, వెలుగు సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు