ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో పంపనూర్ తండా గ్రామంలో శుక్రవారం ఇంటింటికి జ్వరాల సర్వే నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంట్లో నీటి తొట్టెలు, పాత డబ్బాలు, కూలర్లు, టైర్లు, టెంకాయ చిప్పలు, పూల కుండీలు అన్నిటీలో లార్వా వెతకడం జరిగింది. అలాగే మలేరియా సోకిన రోగి ఇంట్లో పైరేత్రం ద్రావణాన్ని దోమలు లేకుండా చేయడానికి పిచికారీ చేయడం జరిగింది. అలాగే నీటి నిల్వలు ఉన్న చోట అబేట్ ద్రావణాన్ని పిచికారి చేయడం జరిగింది. గ్రామంలో ఇంటింటికి దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం సోకిన వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. మలేరియా జ్వరంనకు 14 రోజుల పాటు చికిత్స తీసుకోవాలి అలాగే 15వ రోజు మళ్ళీ పరీక్ష చేయిచుకుని తగ్గింది లేనిది నిర్దారించుకోవాలని ప్రజలకు అవగాహన కల్గించడం జరిగింది. అలాగే ముందు జాగ్రత్తగా మలేరియా సోకిన రోగి ఇంటి చుట్టుపక్కల వారికి రక్త పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తారణా అధికారి నాగేశ్వరయ్య, మలేరియా ఉప విభాగం సూపర్ వైజర్లు నూరు బాషా, శేఖర్, ఏఎన్ ఎమ్ వెంకట లక్ష్మీ, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ వెన్నెల, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










