Jun 04,2023 15:44
  • ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు  

ప్రజాశక్తి-నార్పల : ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి  సూచన మేరకు  నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు  నాగలి పట్టి సేద్యము చేసి పోలం దున్ని రైతులకు మంచి జరగాలని మంచి పంటలు పండాలని రైతుల అందరికి ఏరువాకు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులను బుదేవి వరుణ దేవుడు కరుణించి రైతులు అందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటూ రానున్న ఎన్నికల్లో రైతుల  కోసం తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  అన్నదాత పథకం కింద 20 వేలు రూపాయిలు సహాయము ప్రకటించడం సంతోషంగా ఉందని రైతులు అన్ని విధాలుగా అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎరినాగప్ప, సర్పంచు వెంకటనారాయణమ్మ,  సుధాకర్ రెడ్డి, సాంబశివారెడ్డి,యూనిట్ ఇంచార్జ్  మల్ రెడ్డి  శివారెడ్డి ,క్లస్టర్ ఇంచార్జ్ లు తలారి కుల్లాయప్ప, పి ఎల్ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ రాఘవ నాయుడు, తెలుగు యువత చంద్రబాబు, మాజీ సర్పంచ్ బొగ్గు నారాయణస్వామి, బి ప్రతాప్ రెడ్డి, ఎల్ వెంకటనారాయణరెడ్డి, రామిరెడ్డి, రాయపరెడ్డి, సంజీవరెడ్డి,రఘు రాములు, గంగాధర, శ్రీరాములు, జి గోపాల్ రెడ్డి, లక్ష్మీనారాయణ, నరసింహులు, సన్నారాయణ,అమిలినేని సత్తి, సర్పంచ్ గురు, కమలాకర్ , డెబ్బై, మంజు, రంగయ్య, బీసీ సెల్ ధనుంజయ, రైతు సాధికారక కమిటి రాజగోపాల్, శేఖర్, యూనిట్ ఇంచార్జ్ గంగాధర నాయుడు,  భూత్ కమిటీ భార్గవనాయుడు, గ్రామ కమిటీ భక్తవత్సల్,  సత్తి, గ్రామ కమిటీ శంకర్, యూనిట్ ఇంచార్జ్ నాగభూషణ, బూత్ కమిటీ మారుతి, చాములూరు ఆనంద్,అది, భాస్కర్, చలపతి, ముచ్చుగుంటపల్లి గోపాల్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షుడు దాసరి రాము, దిగ్గిమి చంద్రమౌళి, ఐ టి డి పి అశోక్, బి చక్రవర్తి, ఆర్ నాగేంద్ర,  మురళి,వడ్డే, మహేష్, హరీష్, గణేష్, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.