ప్రజాశక్తి-బొమ్మనహాల్ : బొమ్మనహల్ మండలంలోని ఉదేహళ్ దర్గా హోన్నూర్ బొమ్మనహాల్ శ్రీధర్ ఘట్ట గ్రామానందుగల బ్యాంకుల నందు రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను రెన్యువల్ చేయడానికి రైతులు బ్యాంకుల వద్ద పడి కాపులు కాస్తున్నారు మొత్తం వడ్డీ అసలు చెల్లించాలని బ్యాంకు అధికారులు డిమాండ్ చేయడంతో రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి లక్ష రూపాయలకు 10 రోజులకు ₹1000 వడ్డీ చెల్లించి తీసుకుని రావాల్సిన దుస్థి ఏర్పడింది. సకాలంలో పంటలు పండగ తీసుకున్న అప్పులకు రుణాలు చెల్లించలేక వడ్డీ వ్యాపారులపై ఆధారపడి రైతులు భారీగా నష్టపోతున్నారు. అంతేకాకుండా జిల్లా కేంద్రం నుండి బ్యాంకు చైర్మన్లు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేయాలని గతంలో ఇచ్చిన ఎకరాకు రుణాలను కొంతమేర పెంచాలని ఆదేశాలు ఉన్న గ్రామీణ బ్యాంక్ ఉద్దెహల్ బొమ్మనహల్ గ్రామీణ బ్యాంక్ బొమ్మనహల్ కర్ణాటక బ్యాంక్ ఉద్యోగాలు సిండికేట్ బ్యాంక్ దర్గా ఉన్నోడు సిండికేట్ బ్యాంక్ సోమలాపురం గ్రామీణ బ్యాంక్ ఈరెహళ్ స్టేట్ బ్యాంక్ రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా మొత్తం చెల్లించి రుణాలు రెన్యువల్ చేసుకోవాలని ఆదేశిలవడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసి ప్రతి రైతు రుణం వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకొని ఎలా ఆదేశాలు ఇవ్వాలని స్థానిక రైతులు సిఐటియు సంఘాలు రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకు నందు కౌలు రైతు సంఘాలు ఆధ్వర్యంలో రుణాలు రెన్యువల్ వడ్డీతోనే చేయాలని విజ్ఞప్తి చేసిన బ్యాంకు అధికారులు భే ఖాదర్ చేయడం వల్ల వడ్డీ వ్యాపారులు బ్యాంకు మేనేజర్లు కుమ్మక్కైనారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.










