ప్రజాశక్తి-నార్పల : .మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం పెద్దన్న అనే రైతు వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని గూగూడు రెవెన్యూ పొలంలో సర్వేనెంబర్ 58/3లో తన కు ఐదు ఎకరాల భూమి ఉంది అని గత రెండు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడంలేదని ఆవేదన తో తహశీల్దార్ కార్యాలయం వద్ద తనతో పాటు తెచ్చుకున్న వాష్మాలు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఇతర రైతులు నార్పల ప్రాథమిక కేంద్రానికి తరలించారు నార్పల తాసిల్దార్ నారాయణస్వామి నీకు దిక్కున చోట చెప్పుకో పో చేసేది లేదు అనడంతోనే మా నాన్న ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు అని పెద్దన్న కొడుకు నరేష్ తెలిపాడు మా నాన్నకు ఏమైనా జరిగితే రెవెన్యూ అధికారుల దే బాధ్యత అని స్పందనలో ఫిర్యాదు చేసిన తమకు గోడును అధికారులు పట్టించుకోవడం లేదు అన్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరాడు మెరుగైన వైద్యం కోసంరైతు పెద్దన్న ను 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నార్పల మండలంలో గతంలో కూడా రెవిన్యూ అధికారులు ఇష్టానుసారంగా పాస్ పుస్తకాలు జారీ చేశారని ఆరోపణలు ఉన్నాయి గత పది సంవత్సరాలుగా మండలంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా ఎక్కడా భూ పంపిణీ జరగలేదు. అయినా కూడా నార్పల మండలంలో ఇష్టానుసారంగా అధికారులు పాసుపుస్తకాలు జారీ చేశారని ఆరోపణలు ఉన్నాయి దీనిపైన ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన అధికారుల పైన వాటిని కప్పిపుచ్చుతున్న అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు..










