Mar 17,2023 16:08
  • హాజరైన ఎంఈఓ సాయి లీల విద్యతోనే ఉన్నత ఉన్నత శిఖరాలను ఆహ్వాదించవచ్చు

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : స్థానిక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌహర్ సుల్తాన అధ్యక్షతన శుక్రవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పురోహితులచే శ్రీ సరస్వతి పూజ నిర్వహించి ఘనంగా పూలా అలంకరణతో ఓం చిత్రీకరించి విద్యార్థులు క్యాండిల్ సహాయంతో దీపారాధన చేసి అనంతరం ఉపాధ్యాయులైనగురువులచై విద్యార్థినిలుఆశీర్వాదం పొందారు. విద్యార్థినిలకు స్వీట్లు పంచిన కవర్లో ఒకరికి బహుమతి ని అందజేశారు ఒక విద్యార్థిని బహుమతి అందడంతో ఎంఈఓ సాయి లీలకు విద్యార్థి ఆ బహుమతిని చూపించి సంతోషపడింది. ఇది గమనించిన ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థినీ రాబోయే ఎగ్జామినేషన్లో అధిక మార్పులు సంపాదించి ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా వారి బాటను వారే నిర్ణయించుకొని  విద్యార్థినిలు ముందుకు సాగి మీ తల్లిదండ్రులకు మీకు బోధించిన ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థినీలకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంఈఓ సాయి లీల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌహార్ సుల్తాన. ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు.