ప్రజాశక్తి-గణపవరం : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానికులు ఉపయోగించుకోవాలని అప్పన్నపేట గ్రామ సర్పంచ్ నక్క సూరి బంగారయ్య అన్నారు. బుధవారం పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కంటి చూపుపై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు విటమిన్ ఏ కలిగిన ఆకుకూరలు తీసుకొని కంటి భద్రత కల్పించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు నేత్ర వైద్యులు ఐ.శ్రీనివాస్ చెప్పారు. వారందరికీ కళ్ళజోళ్ళు పడతాయని చెప్పారు. కళ్ళజోళ్ళు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని చెప్పారు. గణపవరం సిఎచ్చ్ ఓ.జాలాది విల్సన్ బాబు, ఎఎన్.ఎం.ఝాన్సీలక్షీ, ఎల్త్అసిస్టెంటు. ఆదినారాయణ, దుర్గారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు










