ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో స్థానిక జూనియర్ కాలేజ్ ఆవరణములో గౌరవ MLA తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరు శంకర నేత్రాలయా వైద్యుల సమక్షంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచిత శస్త్ర చికిత్సల కోసం బెంగళూరుకు తీసుకు వెళ్లడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల వారిని 53 మందిని శస్త్ర చికిత్సలకు ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలకు వచ్చిన వారికి ఎమ్మెల్యే ఎంతో ఔదార్యంతో మండల ప్రజలు ఎవరు కూడ కంటి చూపు సమస్య బాధపడకూడదని ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్, డాక్టర్ అవగాహన కల్గించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వరలక్ష్మి, వన్నురప్ప, డీలర్ రాజశేఖర్, ఓ బి.టైలర్ వెంకటేష్, స్థానిక నాయకులు, శంకర్ నేత్రాలయా సిబ్బంది, డాక్టర్ దయాకర్, ఎంపీహెచ్ ఈ ఓ నాగేశ్వరయ్య, సీహెచ్ ఓ చంద్రావతి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










