Sep 05,2022 15:19
  • నివాళులర్పించిన వైయస్సార్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణమూర్తి

ప్రజాశక్తి బైరెడ్డిపల్లి : మండలంలోని గంగినాయన పల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ సాతాని చంగాలరాయప్ప కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం విధితమే. దీని కారణంగా మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి  తిరుపతి హాస్పిటల్  తరలించగా  డాక్టర్లు పరిశీలించి అప్పటికే మరణించినట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న కొత్త ఇండ్లు గ్రామస్తులు శోకసంద్రం హృదయాలు తలపించారు.  వైయస్సార్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ మొగసాల కృష్ణమూర్తి  మరియు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మండల వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు కొత్త ఇండ్లు గ్రామానికి చేరుకొని ఆయన భౌతికాయానికి పూలమాల సమర్పించి వారి కుటుంబానికి ప్రాగాడ సానుభూతి తెలియపరిచారు.