Sep 25,2022 16:19

ప్రజాశక్తి-యాదమరి : మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు ను దేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహణ కార్యదర్శి వి వినాయక గౌండర్ చిత్తూరు పార్లమెంటరీ తెలుగు రైతు ఉపాధ్యక్షులు పూర్ణచంద్రరావు ఘనంగా సత్కరించారు. ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం ఎమ్మెల్సీ శ్రీనివాసులు స్వగృహం నందు పూలమాల దుస్వాలతో సత్కరించారు. ఎమ్మెల్సీ జైలు నుండి ఇంటికి వచ్చిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ ఆర్ పార్టీ అరాచకాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూకుమ్మడిగా కొన్ని రాబోయే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. శ్రీనివాసులు కలిసిన వారిలో యాదమరి గ్రామ కమిటీ అధ్యక్షులు నాగరాజా, ఓటేరిపల్లి గ్రామ అధ్యక్షులు రాజరత్నం, సింగల్ విండో మెంబర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.