ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : ఉండి మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు గడి జయలక్ష్మి (65) శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. గడి జయలక్ష్మి భౌతికకాయానికి పలువురు గ్రామ ప్రముఖులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ... చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసిన కాలంలో ఉండి మండలం నుంచి డ్వాక్రా గ్రూపులో చేరిన మొట్టమొదటి మహిళ కాగా ఎంతోమంది మహిళలకు టైలరింగ్ నేర్పి జీవనోపాధిని ఇచ్చారని పలువురు తెలిపారు. 2000 సంవత్సరంలో మండల పరిషత్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మండలం అభివృద్ధికి ఎంతో కఅషి చేశారని అన్నారు. తర్వాత కాలంలో ప్రస్తుత పివిఎల్ నరసింహారాజు అభిప్రాయాలతో ఏకీభవించి ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆమె అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో... వైసీపీలో చేరారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. గడి జయలక్ష్మి కి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.










