May 01,2023 16:26

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : సీజనల్ గా వచ్చే వ్యాదులని ముందుస్తు ప్రణాళికల ద్వారా అరికట్ట వచ్చని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వై.వి.లక్షమణరావు అన్నారు. సిబ్బంది గృహసందర్శనాలలో ఇంటివద్ద నెలకొని ఉన్న అపరిశుభ్ర వాతావరణంను దానివల్ల వచ్చే అనారోగ్య పరిస్థితులుపై ప్రజలను చైతన్య వంతులుగా చేయాలని తెలిపారు. వైద్యాధికారి డా.ఆశాలత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ గృహాల సముదాయాలు పరిశుభ్రముగా ఉంచుకొనుట, వారమునకు ఒకసారి డ్రై డే పాటించుట ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చునని అన్నారు. ఏ విధమైన జ్వరం ఐన ఆరోగ్య సర్వే బృందాలకు తెలిజేయలని ప్రాధమిక పరీక్షలు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో చేయించుకోవచ్చునని ఆమె తెలిపారు. ఆరోగ్య శాఖాధికారుల సలహాలు మరియు పరిసరాల పరిశుభ్రతతో, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించినట్లైతే వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్సులు, ఆశాలు, ఆరోగ్య సహాయకులు కాంతారావు, రామకృష్ణ, ప్రసాద్ బాబు, సాయి  మొదలగువారు పాల్గొన్నారు.