ఏటిఎంలో బ్యాటరీ చోరి
నిందితులకు జైలు శిక్ష
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: చాల సంవత్సరాలుగా కొన్ని కేసులకు సంబందించిన నిందితులకు ఎన్‌బిడబ్ల్యు జారీ చేసి బంగారు పాళ్యం పోలీసులు పిఎఎస్‌జే చిత్తూరులో హాజరుపరిచారు. 2022 వ సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటిఎం లో బ్యాటరీ చోరీ చేసిన నిందితుడిని ప్రిన్సిపాల్ సివిల్ సెషన్ జడ్జి ఎదుట బంగారుపాళ్యం పోలీసులు హాజరుపరిచారు. జిల్లా ఎస్సీ ఆదేశాల మేరకు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న ఎన్‌బిడబ్ల్యూ ను పునఃసమీక్షించే క్రమంలో సి.రవి పలు కేసులలో నిందితుడై ఉన్నాడు. ఇతను 2016వ సంవత్సరం నుంచి పరారిలో ఉన్నాడు. ఇతనిని పట్టుకునేందుకు బంగారుపాళ్యం ఇన్‌స్పెక్టర్ జి.వి.నగరాజ రావు ఆధ్వర్యం లో, బంగారుపాళ్యం ఎస్‌ఐ శ్రీ రాం భూపాల్, సిబ్బందితో ఒక ప్రత్యేక బృందం ఏర్పరిచి సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో నిందితుడిని తిరుపతి జిల్లా లో బంగారుపాళ్యం పోలీసులు ఎన్‌బిడబ్ల్యూ జారి చేసి పిఎఎస్‌జే (ప్రిన్సిపాల్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్) కోర్ట్, చిత్తూరు లో శుక్రవారం హాజరు పరిచారు. 2022వ సంవత్సరంలో కె.జి.సత్రం లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటిఎం లో బ్యాటరీ చోరీ చేసిన రవి , షణ్ముగం ను ప్రిన్సిపాల్ సివిల్ సెషన్ జడ్జి ఎదుట హాజరపరచగా అతనికి 1 సంవత్సరం3 నెలలు జైలు శిక్ష విధించారు.










