మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్
ప్రజాశక్తి - క్యాంపస్ :
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఏఆర్‌ఎల్ తిరుపతి డాక్టర్. రాజేంద్రప్రసాద్, విశిష్ట అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌వి.సత్యనారాయణ పాల్గొన్నారు. అతిధులు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మెకానికల్ ఇంజనీరింగ్ విశిష్టతను వివరించారు. విద్యార్థులకు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతమైన విద్యా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. విద్యార్థులు సరైన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య పి. వెంకటరామయ్య, ఆచార్య వి.దివాకర్ రెడ్డి, కే.రాజేష్ బాబు, డాక్టర్. కే.ధర్మారెడ్డి, డాక్టర్.పి.హేమ, డాక్టర్ ఏ.శ్రీనివాసులరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.










