ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
ఈ కార్యక్రమంలో 20 విభాగాలలో 2019, 2020 సంవత్సరంకు సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో బెస్ట్ అవార్డులను అందించారు. 2019 లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును డాక్టర్ జి.తిమ్మారెడ్డి, 2020కి డాక్టర్ లాలాకిషోర్‌లు అందుకున్నారు. అవార్డు గ్రహీతలను జేఎన్‌టీయుఏ ఉపకులపతి డాక్టర్ రంగజనార్ధన్, ఐఎస్‌టిఈ ప్రెసిడెంట్ ప్రతాప్‌సింగ్ కాకాసాహెబ్ దేశాయిలు శాలువతో ఘనంగా సత్కరించారు. అవార్డు గ్రహీతలు జేఎన్‌టీయుఏ రిజిస్ట్రార్ డాక్టర్ సి.శశిధర్, ఉత్తమ సివిల్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ సుజాత, ఉత్తమ పరిశోధన శోభలు అదుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపి సెక్రటరీ ఈశ్వర్‌రెడ్డి, ఛైర్మన్ సారధి, రవీంద్రబాబు, ఎస్వీసిఈ కళాశాల ఛైర్మన్ గంగిరెడ్డి , వైస్ ఛైర్మన్ ప్రకాష్ అంబవరం, ప్రదీప్, ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకరరెడ్డి, కల్పలతారెడ్డి పాల్గొన్నారు.










