ఎస్వీ యూనివర్శిటీ టోర్నమెంట్‌లో
31 పతకాలు 'విజయం' సొంతం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: తిరుపతిలోని ఎస్వీ యూనివర్శటిలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్లలో స్థానిక మిట్లూరులోని విజయం సైన్సు అండ్ ఆర్ట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు వివిధ క్రీడాపోటీల్లో పాల్గొని 31పథకాలు సాధించిన్నట్లు విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో యువశ్రీ హైజంప్ గోల్డ్‌మెడల్, కిరణకుమార్ బాక్సింగ్ గోల్డ్‌మెడల్, మహేశ్వరి షాట్‌పుట్ ద్వితీయ స్థానం, యువశ్రీ, రమ్య, చందన, రూపలు రన్నింగ్ కాంపిటీషన్‌లో తృతీయ స్థానం సాధించిన్నట్లు తెలిపారు. అలాగే బాలుర స్టాఫ్‌బాల్ విభాగంలో 12మంది ద్వితీయ స్థానం, బాలికలు కోకో లో 12 మంది ద్వితీయ స్థానం సాధించారని ఈ సందర్భంగా విజేతలను తేజోమూర్తి అభినందించారు. ఈకార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ శశికుమార్, శరత్‌కుమార్‌లతో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు.










