ఎస్పీకి బొకే అందజేస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ఎల్‌ఎం ఉమామోహన్‌రెడ్డి దంపతులు
అనంతపురం కలెక్టరేట్ : ఎస్పీగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన కెకెఎన్ అన్బురాజన్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ఎల్‌ఎం.ఉమామోహన్‌రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతోపాటు భర్త, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు ఎల్‌ఎం.మోహన్‌రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా త్వరలోనే జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించాలని కోరగా ఇందుకు ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బిసిఆర్.దాస్, తదితరులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.










