Oct 14,2023 22:17

రికార్డులను పరిశీలిస్తున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి- మెళియాపుట్టి:  మెళియాపుట్టి పోలీస్‌స్టేషను శనివారం జిల్లా ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌ రికార్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించారు. భవనం మరమ్మతులు గురికావడంతో రికార్డులు తడిసిపోకుండా భద్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అలాగే సరిహద్దుల్లో అక్రమ రవాణాలపై మరింత దృష్టి సారించాలన్నారు. నాటు సారా తయారీ, రవాణాలపై దృష్టి సారించాలన్నారు. పెండింగ్‌ కేసులపై దృష్టి సారించాలని, గ్రామాల్లో శాంతిభద్రతల్లో విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం సిఐ వినోద్‌బాబు, ఎస్‌ఐ టి.రాజేష్‌, ఎఎస్‌ఐలు నర్సింగరావు, అప్పన్న సిబ్బంది ఉన్నారు.