ప్రజాశక్తి - తణుకురూరల్
చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహిస్తే వారి ద్వారా మరికొంత మంది కళాకారులకు ఉపాధి లభిస్తుందని అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్‌ఎస్‌సి (విజయవాడ) ఎన్.అపర్ణలక్ష్మీ అన్నారు. సోమవారం ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల ఆవరణలో కమీషన్ హేండీక్రాఫ్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీ, హెచ్‌ఎస్‌సి విజయవాడ, వశిష్ట గోదావరి లేసు మోడ్-యుపిఎస్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, రామన్నపాలెం, మొగల్తూరు, ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో జరిగిన హస్తకళ ప్రదర్శన కళశాల ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హేండ్‌క్రాఫ్ట్ ప్రమోషన్ ఆఫీసర్ ఎం.సువర్ఛల మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో మనిషి సృజనాత్మకతను పోగొట్టుకుంటున్నాడని, కళల ద్వారా మానసిక వికాసాన్ని, ఉపాధి కూడా పొందొచ్చన్నారు. కళాశాల మేనేజ్‌మెంట్ సభ్యురాలు చిట్టూరి రీనాసాయి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిడి సుధీర్‌కుమార్, కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సత్యఉషారాణి, పరిపాలనాధికారి డి.సుబ్బారావు, కెవి.శ్యామలాదేవి, వి.తులసీరత్నం పాల్గొన్నారు.










