ప్రజాశక్తి - తణుకురూరల్
ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల విద్యార్థిని కె.కార్తికఉష శ్రీదుర్గ బెంగుళూరులో జరిగిన ఖేలో ఇండియా 10 కెకె డమ్ ఉమెన్స్ లీగ్ యోగ, ఆర్టిస్టిక్ సింగిల్ 18 ప్లస్‌లో ద్వితీయ స్థానం సాధించిందని కళాశాల ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ చిట్టూరి సత్యఉషారాణి, పరిపాలనాధికారి డి.సుబ్బారావు, యోగ డైరెక్టర్ అబ్బులుచౌదరి అభినందించారు.










