ప్రజాశక్తి-తిరుపతి సిటి
స్థానిక న్యూ బాలాజీకాలనీలోని పోలీసు ఫెరడ్‌మైదానంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌ఈబి డైరెక్టర్ ఆవుల రమేష్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసులు సమాజ రక్షణకు, ప్రజా భద్రతకు చేస్తున్న కృషిని చూసి, వారికి తమ వంతు సహాయంగా 20 స్కూటర్లను ఇచ్చేందుకు ముందుకొచ్చిన పృద్వీ హీరో షోరూం నిర్వాహకులను ఆయన అభినందించారు. పృధ్వీహీరో షోరూం యాజమాని జి.పృధ్వీరెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా, వాటిని నిర్మూలించేందుకు ఎస్‌ఈబి సిబ్బంది, అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈబి జాయింట్ డైరెక్టర్ విద్యాసాగర్ నాయుడు, సూపరింటెండెంట్ స్వాతి, శ్రీనివాసరావు, ఎస్‌ఈబి రూరల్ సిఐ ఫణీంద్ర, అర్బన్ సిఐ నాగార్జునరెడ్డి, పృధ్వీషోరూం సేల్‌మేనేజర్ అశోక్‌రెడ్డి, జిఎం బిందు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










