ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు
పట్టుబడిన వారిలో ఆర్టీసీ డ్రైవర్
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
సోమవారం టాస్క్‌ఫోర్స్ ఆవరణలో మాట్లాడుతూ వీరి నుంచి రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆర్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలోని ఆర్‌ఎస్‌ఐ వినోద్‌కుమార్‌రెడ్డి బృందం ఆదివారం రాత్రి నుంచి చిత్తూరు ఈస్ట్ డివిజన్ ఎస్‌ఆర్‌పురం మండలంలో కూంబింగ్ చేపట్టారన్నారు. సోమవారం ఉదయం ఎస్‌ఆర్‌పురం మండలం పుత్తూరు మెయిన్ రోడ్డు సమీపంలో ఉన్న మట్టి రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్ళుపై వస్తూ కనిపించారని టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని చూసి పారి పోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకోవడంతో వారి వద్ద మూడు ఎర్రచందనం దుంగలు ఉన్నాయన్నారు. వీరిని ఎస్‌ఆర్‌పురం మండలంకు చెందిన రంజిత్ (25), శంకర్ (32), మంగసముద్రంకు చెందిన రవి (37)గా గుర్తించామన్నారు. వీరిలో రంజిత్ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా గుర్తించామన్నారు. వీరిని విచారించగా ఆయకట్టు చెరువులో దాచి ఉంచిన 16 ఎర్రచందనం దుంగల ఆచూకి తెలపగా వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇవి 590 కిలోలు ఉన్నాయని, వీటి విలువ 40 లక్షలుగా ఉందన్నారు. సిఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ మేడా సుందరరావు, ఆర్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డి, సిఐలు రామకష్ణ, ఎస్‌ఐ మోహన్‌నాయక్ పాల్గొన్నారు.










