ఎస్‌ఐలకు సిఐలుగా ఉద్యోగ్యోన్నతి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జిల్లాలో ఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తున్న పలువురికి సిఐలుగా ఉద్యోగ్యోన్నతి కల్పిస్తూ కర్నూల్ రేంజ్ డిఐజి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఎస్‌ఐలు సిఐలుగా ఉద్యోగ్యోన్నతి పొందారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ నిత్యబాబును గురువారం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్.సుధాకర్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ సిఐగా ఉద్యోగ్యోన్నతి పొందినందుకు చాలా సంతోషంగా ఉందని, డిటిసిలో పనిచేసిన కాలం నిరంతరం అంకిత భావంతో, నిబద్ధత, నిజాయితీతో పనిచేశారని తెలిపారు. సిఐగా వెళ్ళిన చోట ప్రజలకు సుధీర్ఘమైన సర్వీస్ చేస్తూ, ఎటువంటి రిమార్క్స్ లేకుండా పనిచేసి పోలీస్ డిపార్టుమెంటుకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఎస్‌బి డి.ఎస్పీ శ్రీనివాసరెడ్డి, డిటిసి డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ విష్ణు రఘువీర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్‌ఐలు మల్లికార్జున, రామకష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.










