ఎస్‌ఆర్ పురం (చిత్తూరు) : ఎస్ ఆర్ పురంలో సుమారు 35 మంది టిడిపి పార్టీలోకి చేరారు. ఆదివారం ఎస్‌ఆర్ పురం మండలంలో పుల్లూరు క్రాస్ రోడ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త భీమినేని చిట్టిబాబునాయుడు సమక్షంలో వెదురుకుప్పం మండలం ఎస్‌ఆర్ పురం మండలం నుండి సుమారు 35 మంది టిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










