ప్రజాశక్తి-ఉరవకొండ ఎరువుల కోసం రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైన మేరకు ఎరువులను అందుబాటులో ఉంచి సరఫరా చేస్తామని విడపనకల్ మండల వ్యవసాయ అధికారి పెన్నయ్య తెలిపారు. గురువారం విడపనకల్ సహకార సంఘం సొసైటీ ఛైర్మన్ శ్రీరాములు, సొసైటీ సిబ్బందితో కలిసి పాల్తూరు ఎరువుల గోడౌన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడపనకల్ సొసైటీ ఇన్‌ఛార్జి సిఇఒ ఎర్రిస్వామి పూర్తి బాధ్యతలు తీసుకుని ఈపాస్ మిషన్ అప్డేట్ చేయించుకుని రైతులతో వేలిముద్రలు తీసుకుని ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. సకాలంలో రైతులకు ఎరువులు పంపిణీ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం పాల్తూరు ఎరువుల గోడౌన్‌లో 24 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. కావాల్సిన రైతులు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సేల్స్‌మేన్ ఈశ్వరయ్య, రైతు భరోసా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
విత్తనకాయలను పరిశీలిస్తున్న నాయకులు, అధికారులు










