Mar 18,2022 23:25

దుంగలను, స్మగ్లర్ల అరెస్టును చూపుతున్న అధికారులు



ప్రజాశక్తి-యర్రావారిపాలెం:
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు 650 కెజిలు ఉన్నాయని, విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలైకు చెందిన సి.శివరాజ్‌ (35), జి.శేఖర్‌ (33), ఎస్‌.శక్తివేలు (35), కె.కష్ణమూర్తి( 51), కె.రవి (45), ఐదు మంది తమిళ స్మగ్లర్లును పట్టుకొని కేసు నమోదు చేసి పీలేరు కోర్టులో హాజరుపరచామన్నారు. ఈ దాడుల్లో ఎఫ్‌ఎస్‌ఓ రవిరావు, ఎఫ్‌బివోలు వందనకుమార్‌, వినోద్‌కుమార్‌, చెంగల్రాయ నాయుడు, బేస్‌ క్యాంప్‌ ప్రొటెక్షన్‌ వాచర్లు, తలకోన సిబిఇటి సభ్యులు పాల్గొన్నారు.