ప్రజాశక్తి -రాపూరు :రాపూరు రేంజ్ పరిధిలో అక్రమంగా ఎర్ర చందనం రవాణాకు సిద్ధమవుతుండగా 17 ఎర్రచందనం దుంగలను మహేంద్ర వాహనాన్ని, రెండు ద్విచక్ర వాహనాలతోపాటు ఒక వ్వక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రాపూరు ఫారేస్టు రేంజ్ అధికారి రవీంద్ర బాబు తెలిపారు. ఈ సందర్బంగా రవీంద్రబా బు మాట్లాడుతూ శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారి అవుల చంద్రశేఖర్‌కు ఎర్ర చందనం పోరుమావిళ్ల నుంచి అక్రమ రవాణా జరుగుతుందన్న సమా చారం మేరకు జిల్లాలో ఉన్న 5రెంజ్‌ల పరిధఙలో 4 రేంజ్‌లు ఆత్మకూరు ఉదయగిరి, రాపూరు, నెల్లూరు అటవీ క్షేత్రాధి కారులను అప్రమత్తం చేశారు. నిఘా పెట్టడం తో శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గోనుపల్లి సెక్షన్ తెగచర్ల అడవిలోపల కోడూరు సరిహద్దు తనిఖీలు చేసి పట్టుకున్నారు. వాహనాన్ని, ఎర్రచందనం దుంగలను ఆదూరాపల్లి తరలించినట్లు రేంజర్ రవీంద్రబాబు తెలిపారు.










