మాట్లాడుతున్న వైసిపి నాయకులు
ఎపికి 'జగనే ఎందుకు కావాలి'
ప్రజాశక్తి-సంగం:స్థానిక టిడిఆర్ కళ్యాణ మండపంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమంపై వైసీపీ సర్పంచులు, గహ సారథులు, సచివాలయం కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమానికి సంబందించిన విది విధానాలను వారికి వివరించారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కుల మతాలకు అతీతంగా సిఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.రాబోయే ఎన్నికలలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి సిఎం అవడం తథ్యమన్నారు. కార్యక్రమంలో గహ సారథుల కన్వీనర్ మల్లికార్జున రెడ్డి, దువ్వూరు సొసైటీ అధ్యక్షులు మధన్ మోహన్ రెడ్డి, వైసీపీ బిసి నాయకులు ప్రసాద్ గౌడ్, సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి, చంద్రా రెడ్డి, మోహన్ రెడ్డి, రఘురామయ్య, శంకరయ్య పాల్గొన్నారు.










