Oct 04,2023 20:58

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం
ఎపిఎంఎఫ్‌ సభ్యత్వ కార్యక్రమం ఆరంభం
ప్రజాశక్తి-నెల్లూరు:ఏపీ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని టౌన్‌ హాల్‌ రీడింగ్‌ రూమ్‌లో ఆంధ్రప్రదేశ్‌ మీడియా ఫెడరేషన్‌ (ఎపిఎంఎఫ్‌) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ట్రాఫిక్‌ డిఎస్‌పి అబ్దుల్‌ సుబహాన్‌ పాల్గొని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్‌ డిఎస్‌పి అబ్దుల్‌ సుభహాన్‌ మాట్లాడుతూ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులందరికీ పోలీస్‌ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సేవలు ఎంతో అభినందనీయమన్నారు.ఏపీ ఎంఎఫ్‌ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభానికి తనకు ముఖ్య అతిథిగా పిలిచిన ఏపీఎంఎఫ్‌ జిల్లా శాఖ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్‌ మీడియా ఫెడరేషన్‌ జిల్లా కన్వీనర్‌ ఐ మల్లికార్జున, కో కన్వీనర్స్‌ ఎం శ్రీహరి, ప్రసాద్‌, మొహమ్మద్‌ రఫీ, సీనియర్‌ జర్న లిస్ట్‌, అంతిమ తీర్పు తెలుగు దినపత్రిక జిల్లా బ్యూరో ఎండి నయీమ్‌ ఖాన్‌,ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ జర్నలిస్టులు షేక్‌ సంధాని, మహమ్మద్‌, వెంకటే శ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.