Sep 04,2023 21:43

ఎపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ సువనసోనీని అనంతపురం, గుత్తి ఐలా పారిశ్రా మికవేత్తలు

          ప్రజాశక్తి-అనంతపురం  ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ సువనసోనీని సోమవా రం నగరంలోని కార్యాలయంలో అనంతపురం, గుత్తి ఐలా పారిశ్రా మికవేత్తలు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు మాట్లాడుతూ ఎంతో అనుభవం ఉన్న అధికారిణి జోనల్‌ మేనేజర్‌గా జిల్లాకు రావడం శుభపరిణామం అన్నారు. అనంతరం సువన సోనీ మాట్లాడుతూ తనకూ జిల్లాకూ విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తాను ఇక్కడ క్లర్కు స్థాయి నుంచి ఈ స్థాయి వరకూ పని చేసిన అనుభవం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలు, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ నాగార్జునరావు, సిబ్బంది బాలచంద్రగౌడ్‌, రామాంజి, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.