Aug 20,2023 00:32

ఏనుగుల దాడిలో రైతు మతి
ప్రజాశక్తి-పెద్దపంజాణి: ఏనుగుల దాడిలో రైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసు కుంది. స్థానిక గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. ముదిరెడ్డిపల్లి గ్రామ రైతు మార్కొండయ్య(52) తన భార్య అరుణమ్మతో కలిసి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఆవులు మేపుకొని, వ్యవసాయ పనులు ముగించు కొని ఇంటికి వస్తున్న సమయం లో ఒక్కసారిగా ఏనుగు దాడి చేయడంతో మార్కొం డయ్య అక్కడికక్కడే మతి చెందా రు. మతుని భార్య అరుణమ్మ కేక లు వేసుకుంటూ గ్రామంలోకి వెళ్ల డంతో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీ లించగా అప్పటికే మతి చెందినట్లు గ్రామ స్తులు తెలిపారు. ఈ విషయం స్థానిక సర్పంచ్‌ చంద్రమోహన్‌ బీట్‌ ఆఫీసర్‌ రవి, గార్డు దొరస్వామికి తెలియజేసినట్లు ఆయన తెలి పారు. ఇప్పటికే ఏనుగుల దాడిలో ముగ్గురు రైతులు మరణించినట్లు సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు రైతులు, గ్రామ స్తులు ఫారెస్ట్‌ అధికారులకు ఏనుగుల సమస్యను తెలియజేసి నా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగినప్పుడు చర్యలు తీసుకుం టాం అని చెప్పి ఆ తర్వాత ఫారెస్ట్‌ అధికారులు పట్టించుకోకపోవడంతోనే రైతులు ప్రాణాలు పోతున్నాయని గ్రామస్తులు తెలిపారు.