Nov 21,2022 22:09

ఏనుగుల దాడిలో పంట నష్టం
- వరి, చెరకు ధ్వంసం - సంఘటన స్థలాన్ని పరిశీలించిన వీఆర్వో
ప్రజాశక్తి- సోమల :
సదుం మండలంలోని మూడు గ్రామాల పరిధిలో పలువురి రైతులకు చెందిన వరి, చెరకు పంటలపై ఏనుగుల గుంపు దాడిచేసి రైతులకు తీవ్రనష్టాన్ని కలిగించాయి. పోతంవారిపల్లి, ఉప్పరపల్లి, నల్లరాళ్లపల్లి గ్రామాల పరిధిలోని జి. మోహన చెరకుతోట, సుశీలమ్మ వరి, వై.రాధాకష్ణ వరి, మామిడి చెట్లు, రమేష్‌, సుబ్రమణ్యం, గణేష్‌ అనే రైతులకు చెందిన పంటల పై దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగించాయని తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. సంఘటన స్థలానికి వీఆర్వో పురుషోత్తం పరిశీలించి నివేదికలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.