ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
ప్రజాశక్తి-ఎస్‌ఆర్ పురం: ముందస్తు ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా టిడిపి నాయకులు, కార్యకర్తలు, టిడిపి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉండాలని గంగాధర నెల్లూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ థామస్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రమైన పుల్లూరు క్రాస్ తెలుగుదేశం పార్టీ కార్యా లయంలో ఎస్‌ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షులు జయ శంకర్ నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ థామస్, నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చిట్టి బాబు నాయుడు లు ఆరు మండలాల అధ్యక్షులతో కలి సి ఓటర్ల సమగ్ర సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ థామస్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా నాయకు లు, కార్యకర్తలతో కలిసి ముందుగా ఎస్‌ఆర్ పు రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకం ఎగరవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, క్లస్టర్, యూనిట్, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులు ఓటర్ల జాబితాలను ఆయా బూత్ స్థాయి నాయకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఫేక్ ఓటర్లను లిస్ట్ నుండి తొలగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దామోదరం, కేఎం రవి మోహన్ నాయుడు, బాలాజీ నాయుడు, బాబు నాయుడు, వేమన్నాయుడు, కొత్తపల్లి రమేష్, గురునాథం తదితరులు పాల్గొన్నారు.










